ప్రముఖ సినీ డైరక్టర్ ఆత్మహత్య.. కారణం అదేనా.?

ప్రముఖ సినీ డైరక్టర్ ఆత్మహత్య.. కారణం అదేనా.?

ప్రముఖ సినీ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. పూర్తివివరాల్లోకి వెళితే గురుప్రసాద్ కర్ణాటకలోని మదనాయకనహళ్లిలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈరోజు గురుప్రసాద్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్ళిన పోలీసులు గురుప్రసాద్ మృత దేహాన్ని కనుగొన్నారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు సేకరించి పోస్టుమార్టంకి తరలించారు. 

అయితే కుటుంబంతో  విభేధాల కారణంగా డైరెక్టర్ గురుప్రసాద్ గత కొద్ది నెలలుగా ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గురుప్రసాద్ బందువులు తెలిపారు. దీంతో ఒంటరితనం, ఆర్టిక ఇబ్బందులు వంటివాటి కారణంగానే గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : లక్కీ భాస్కర్ టీమ్ ని అప్రిషియేట్ చేసిన విశ్వక్..

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ గురుప్రసాద్ 2006లో "మఠ" అనే సినిమాతో కెరీర్ ని ప్రారంభించాడు. ఈ క్రమంలో 2009లో గురుప్రసాద్ తెరకెక్కిన "ఎద్దేలు మంజునాథ" అనే సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అలాగే 2014లో కన్నడ బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. కానీ కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని 52 ఏళ్ల వయసులో మరణించాడు.