టాలీవుడ్​ హీరోతో కాంతారా బ్యూటీ

టాలీవుడ్​ హీరోతో కాంతారా బ్యూటీ

‘కాంతార’ సినిమాతో ప్యాన్​ ఇండియా రేంజ్​లో గుర్తింపు తెచ్చుకుంది నటి సప్తమి గౌడ. ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ బ్యూటీ నటిగానే కాదు జాతీయ స్థాయి స్విమ్మర్​గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినీ ఎంట్రీ ఇచ్చి కాంతారతో బ్లాక్​ బస్టర్​ అందుకుంది. తెరపై రిషభ్​ శెట్టితో అద్భుతమైన కెమిస్ట్రీని పండించింది. 

తాజా సమాచారం ప్రకారం సప్తమి హీరో నితిన్​ సినిమాలో లీడ్​ రోల్​ చేయనుందట. వేణు శ్రీరాం దర్శకత్వంలో నితిన్​ ‘తమ్ముడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది. తెలుగులో ఇప్పటికే ఈ హీరోయిన్​కి మంచి ఫ్యాన్​బేస్​ ఏర్పడింది. ఇక నితిన్​ సరసన చాన్స్​ కొట్టేసిందన్న వార్తతో టాలీవుడ్​లో ఈ అమ్మడి పేరు హాట్​ టాపిక్​గా మారింది.