అక్టోబర్ 15న తెలుగులో విడుదల కానున్న ‘కాంతార’

అక్టోబర్ 15న తెలుగులో విడుదల కానున్న ‘కాంతార’

‘కేజీయఫ్’ తర్వాత హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రేజ్.. ప్యాన్ ఇండియా రేంజ్‌‌‌‌‌‌‌‌లో పెరిగింది. ఈ సంస్థ నిర్మిస్తున్న ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. ఇటీవల ఈ బ్యానర్‌‌‌‌ నుండి ‘కాంతార’ సినిమా వచ్చింది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. దీంతో ఇతర భాషల్లోనూ దీన్ని డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

తెలుగు రైట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా  అక్టోబర్ 15న తెలుగులో విడుదల చేస్తున్నారు.  రిషబ్ శెట్టి లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు, తనే స్వయంగా దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మాత. అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతాన్ని అందించాడు.