సాహితీ కళారూపాల్లో కానూరి చిరంజీవి

సాహితీ కళారూపాల్లో కానూరి చిరంజీవి

ముషీరాబాద్, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు తన పదునైన సాహిత్యం, కళారూపాలతో ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారని ప్రముఖ విమర్శకులు సతీశ్ చందర్ కొనియాడారు.

శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 7వ రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆట, పాట, మాటలను విప్లవ ఉద్యమం కోసమే అంకితం చేసిన కానూరి సాహిత్యం ఈ శతాబ్దపు చిరునామాగా నిలుస్తుందని చెప్పారు.