హరిద్వార్ లో రెచ్చిపోయిన కన్వారియాలు.. ఓ కారును ధ్వంసం చేసిన వీడియో వైరల్

హరిద్వార్ లో రెచ్చిపోయిన కన్వారియాలు.. ఓ కారును ధ్వంసం చేసిన వీడియో వైరల్

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, కన్వారియాలు (శివ భక్తులు) వృద్ధ దంపతుల కారును ధ్వంసం చేశారు.   ఈ ఘటనపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. "కన్వారియాలు ముస్లిం భార్యాభర్తల కారును ధ్వంసం చేసిన ఘటన  మగళూరు మండిలో జరిగింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది, 

'మిస్టర్ హక్' అనే మరో ట్విట్టర్ ఖాతా కూడా వీడియోను పోస్ట్ చేసి హిందీలో ఇలా వ్రాశాడు, "హరిద్వార్ మగళూర్ మండిలో ముస్లిం జంట కారును కన్వారియాలు ధ్వంసం చేసినట్లు వీడియో లో చెప్పబడింది. అయితే ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని హరిద్వార్ పోలీసులు ఖండించారు. ఈ కారు ప్రతాప్ సింగ్‌కు చెందినదని పోలీసులు తెలిపారు.  అవగాహన లేకుండా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాఖ్యానించవద్దని పోలీసులు హెచ్చరించారు. 

జూలై 10న మగళూరు ప్రాంతంలో  కన్వారియాలు  కారును ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడి  విషయంలో పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని కొంతమంది మండిపడుతున్నారు.  కానీ ..కారు డ్రైవర్  ప్రతాప్ సింగ్ ఫిర్యాదు మేరకు, హరిద్వార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  కారు డ్రైవర్ ప్రతాప్ సింగ్  డ్రైవరు స్కల్‌క్యాప్ ధరించి, బురఖా ధరించిన ఒక మహిళ కారులో నుంచి బయటకు వస్తున్నట్లు వీడియోలో ఉంది" అని జర్నలిస్ట్ మీర్ ఫైసల్ రాశారు. "ఈ సంఘటనలోఏ మతానికి సంబంధం లేదని  హరిద్వార్ పోలీసులు తెలిపారు.