కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్

కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్

కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ గడ్డం సరోజా వివేకానంద్ అన్నారు. ‘‘ఈ విజయం మా లెక్చరర్లు, సిబ్బంది, స్టూడెంట్ల సమిష్టి కృషికి నిదర్శనం. ఓయూ పరిధిలో 770కి పైగా కాలేజీలుండగా, వీటిలో 33 అటానమస్ కాలేజీలున్నాయి. వీటిలో 30 కాలేజీల్లో మాత్రమే న్యాక్ గ్రేడ్ ఉంది. మా కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి ఏ గ్రేడ్ రావడం గర్వంగా ఉంది” అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత వెంకటస్వామి (కాకా) 50 ఏండ్ల కింద స్థాపించిన ఈ కాలేజీ ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తున్నదని చెప్పారు. న్యాక్ ఏ గ్రేడ్​ గుర్తింపు రావడం వెనుక కాలేజీ ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కృషి ఉందని.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు సరోజా వివేకానంద్​ అన్నారు.