మెదక్​ పార్లమెంట్ నామినేషన్ల పరిశీలన పూర్తి

మెదక్​ పార్లమెంట్ నామినేషన్ల పరిశీలన పూర్తి
  • స్క్రూటినీలో ఒకనామినేషన్ ​తిరస్కరణ
  •  జిల్లా ఎన్నికల అధికారి ​రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​పార్లమెంట్​ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్త్కోటి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్క్రూటినీ నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో 54 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఒక్క నామినేషన్​తిరస్కరణకు గురి కాగా 53 అభ్యర్థుల నామినేషన్ ఆమోదించారు.  ఇండిపెండెంట్ అభ్యర్థి సంగారెడ్డికి చెందిన కళ్లు నర్సింలు గౌడ్​నామినేషన్ తిరస్కరణ గురైనట్లు కలెక్టర్​ రాహుల్ రాజ్​తెలిపారు. 

రెండో విడత ర్యాండమైజేషన్​ పూర్తి

మెదక్​ పార్లమెంట్​ఎన్నికలకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్​ ప్రక్రియ పూర్తియిందని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్​రాజ్​తెలిపారు. శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటీ, సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి , అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో  రెండో విడత  ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీవోలను మొత్తం 3,540 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అలాట్ చేసినట్లు వివరించారు. ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్​ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సలహాల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని సూచించారు.