కరీంనగర్ టౌన్, వెలుగు: రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలాల వారీగా సాగు భూముల విస్తీర్ణం, సాగవుతున్న పంటల వివరాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
