కరీంనగర్ టౌన్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకతతో నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.
ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని.. అర్హత ప్రమాణాల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఏ దరఖాస్తును తిరస్కరించవద్దని సూచించారు. సమావేశంలో బల్దియా కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు మల్లికార్జునస్వామి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
