చొప్పదండి ఎస్ఐ హెడ్ క్వార్టర్స్‌‌కు అటాచ్

చొప్పదండి ఎస్ఐ హెడ్ క్వార్టర్స్‌‌కు అటాచ్

కరీంనగర్ జిల్లాలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై కరీంనగర్ సీపీ స్పందించారు. చొప్పదండి ఎస్ఐ రాజేశ్ ను పోలీస్ కమీషనరేట్ కు అటాచ్ చేస్తూ సీపీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై రూరల్ ఏసీపీ కరుణాకర్ ను విచారణాధికారిగా నియమించినందున నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు ఎస్ఐని సీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు వెల్లడించారు. నివేదిక ప్రకారం ఎస్ఐపై చర్యలుంటాయన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత కామెంట్స్ పెట్టిన వారిపై కూడా చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఒకరిని ఉద్దేశిస్తూ చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన తొంటి పవన్ పోస్టు చేశారు.

అసభ్యకరంగా ఉందనే కారణంతో చొప్పదండి ఎస్ఐ రాజేష్ పీఎస్ కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారని పవన్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావును సీపీ ఆదేశించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ ను కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. కమీషనరేట్ పరిధిలో తప్పు చేసిన నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే కానీ.. శారీరకంగా బాధించారని.. ఇలా చేసిన వారిని ఉపేక్షించేది లేదని సీపీ సూచించారు. అలాగే..విధ్వే్షపూరితంగా శతృత్వం పెంచడం కోసం పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చొప్పదండిలో అసభ్యకరమైన పోస్టు పెట్టిన తొంటి పవన్ కుమార్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.