ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వేగంగా వచ్చేస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 224 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 117 స్థానాల్లో లీడ్ లో ఉంది. అధికారం చేపట్టటానికి 113 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 117 చోట్ల ఆధిక్యంలో ఉంది. 

ఇక బీజేపీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కుమారస్వామి జేడీఎస్ పార్టీ 29 చోట్ల లీడ్ లో ఉంది. ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా వెళుతున్నట్లు ట్రెండ్స్  చెబుతున్నాయి. పూర్తి ఫలితాలు అధికారిక ప్రకటన మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.