కర్ణాటక అసెంబ్లీ బైపోల్ షెడ్యూల్ విడుదల

కర్ణాటక అసెంబ్లీ బైపోల్ షెడ్యూల్ విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ లోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినప్పుడే కర్ణాటక ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించారు. అయితే కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున దానిని నిలిపేశారు. ఇప్పుడు సవరించిన షెడ్యూల్ ను విడుదల చేశారు.

డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. 9న ఫలితాలు ప్రకటిస్తారు. రేపట్నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. రేపట్నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి.