చంద్రబాబు నియోజకవర్గంలో కర్నాటక మద్యం పట్టివేత

చంద్రబాబు నియోజకవర్గంలో కర్నాటక మద్యం పట్టివేత

ఆంధ్రాలో మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వస్తున్న.. పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో కర్నాటకకు చెందిన మద్యం బాటిళ్లను పట్టుకున్నారు పోలీసులు. ఆరు లక్షల రూపాయల విలువైన లిక్కర్ బాటిళ్లను.. వ్యాన్లలో కర్నాటక నుంచి గుడుపల్లి మండలం సోడినానిపల్లికి తీసుకొస్తుండగా.. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

లిక్కర్ బాటిళ్లను తీసుకొస్తున్న ఓ కారు, బైక్ తోపాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఇవ్వటానికి వీటిని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు నిందితులు. అయితే ఏ పార్టీకి చెందిన వారు అనేది వెల్లడించలేదు పోలీసులు. స్థానికంగా లిక్కర్ షాపులు ఉన్నా.. కర్నాటక రాష్ట్రం నుంచి తక్కువ ధరలో.. చీప్ లిక్కర్ తీస్తున్నట్లు వివరించారు పోలీసులు. ఆరు లక్షల రూపాయల విలువైన మొత్తం మద్యం చీప్ లిక్కర్ అని.. చిన్నచిన్న బాటిళ్లలో వీటిని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. 

Also Read :చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పని చేస్తా - ముద్రగడ

ఏపీలో పోలింగ్ కు మరో 50 రోజుల సమయం ఉండగానే భారీ ఎత్తున మద్యం పట్టుబడిందని.. రాబోయే రోజుల్లో ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో నిఘా పెంచుతామని స్పష్టం చేశారు పోలీసులు.