కర్నాటకలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా

V6 Velugu Posted on Jan 23, 2022

బెంగళూరు: కర్నాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజువారీ కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కర్నాటకలోఒక్క రోజులోనే కరోనా బారినపడిన వారి సంఖ్య 50వేల మార్కు దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,20,459మందికి టెస్టులు నిర్వహించగా.. 50,210 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. ఒక్క బెంగళూరులోనే 26,299 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 22,842 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 10 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 22.77శాతంగా ఉంది. కర్నాటకలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,57,796 కాగా.. వాటిలో 2,31,000 కేసులు బెంగళూరులో ఉన్నాయి.

 

Tagged karnataka, Covid-19, Bengaluru, corona cases, National, omicron

Latest Videos

Subscribe Now

More News