తుళు లిపిలో భగవద్గీతను అనువదించిన కర్ణాటక మహిళ

తుళు లిపిలో భగవద్గీతను అనువదించిన కర్ణాటక మహిళ

భగవద్గీత, రామాయణం ఇలాంటి గ్రంధాలు అనేక భాషల్లో లభిస్తాయి.   అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటక మహిళ విదుషి అపర్ణ  మొదటిసారిగా తుళు లిపిలోకి అనువదించారు.  ఆమె భగవద్గీతను తుళు మరియు కన్నడ లిపిలోకి ట్రాన్స్ లేట్ చేసేందుకు మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టి విజయవంతంగా అనువదించారు.

కర్నాటకలోని పుత్తూరుకు చెందిన భరతనాట్య నర్తకి విదుషి తుళు లిపిలోని  భగవద్గీత అనువాద వెర్షన్‌ను  విడుదల చేశారు. ఆమె కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో తుళు లిపిని నేర్చుకున్ననని తెలిపింది.  తన సోదరుడు   సోదరుడు ఉంగ్రుపులితయ్య నుండి తుళు స్క్రిప్టింగ్ నేర్చుకుంది.  అతను చదువుతున్న సంస్కృత  పాఠశాల ఉపాధ్యాయుడు రాధాకృష్ణ ఆచార్య నుంచి   భగవద్గీతను చదివి తుళు లిపిలో రాయడం ప్రారంభించింది. భగవద్గీతలోని  18 అధ్యయాలు పూర్తయిన తరువాత ...   పండితులకు పంపి సాఫ్ట్ కాపీని పరిశీలించాల్సిందిగా  అపర్ణ కోరారు. 

శ్రీ క్షేత్ర సుబ్రహ్మణ్య మఠం శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామి, వేదవ్యాస సంశోదహన కేంద్రం ఆనందతీర్థ సగ్రీ, లక్ష్మీశ తోల్పాడి, సుబ్రహ్మణ్య మఠం సమక్షంలో విదుషి పుస్తకాన్ని విడుదల చేశారు. తుళి, కన్నడ  లిపిలో ఆమె అనువాదం చేసిన భగవద్గీత  పుస్తకం  విడుదలైంది. శ్లోకాలు,  తాత్పర్యలు కన్నడ లిపిలో ఉన్నాయి.  పేజీ ఎడమ వైపున తుళు లిపిలో ఉంది. విదుషి అపర్ణ  MSc(కెమిస్ట్రీ)తో పాటు  భరతనాట్యంలో MA  పట్టా పొందారు.  తుళు భాషను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.