
మునుగోడు నియోజకవర్గంలో ఇవాళ జరగనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ దూరంగా ఉండనున్నారు. కరోనా సోకడంతో ఆయన ఈ సభకు హాజరుకాలేకపోతున్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం ఉందని, టెస్టు చేసుకుంటే పాజిటివ్ గా తేలిందని తెలిపారు. వైద్యుల సలహాల మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నానని అన్నారు. మునుగోడు భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కొరారు.
మునుగోడుకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా అధికారులు ప్రత్యేక రూట్‌ను సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.