
దుబాయ్: వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ఇండియా టీమ్‌ను గురువారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. స్టార్‌పేసర్‌జస్ప్రీత్ బుమ్రాను కొనసాగించిన సెలెక్షన్‌కమిటీ.. వెటరన్‌బ్యాటర్‌కరుణ్‌నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌పై వేటు వేసింది. కరుణ్ప్లేస్లో దేవదత్పడిక్కల్కు చాన్స్‌ఇచ్చింది. టెస్ట్ఫార్మాట్లో కరుణ్, అభిమన్యును కొనసాగించే చాన్స్‌లేదని చీఫ్‌సెలెక్టర్‌అజిత్‌అగార్కర్ సంకేతాలిచ్చాడు.
రాబోయే రోజుల్లో పడిక్కల్, సాయి సుదర్శన్టీమ్కు బాగా ఉపయోగపడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ టూర్లో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించిందని చెప్పిన అగార్కర్.. విండీస్‌తో రెండు టెస్ట్‌ల్లో ఆడిస్తామని వెల్లడించాడు. ‘బుమ్రాకు ఐదు వారాల విరామం లభించింది. కాబట్టి ఈ సిరీస్‌లో ఆడేందుకు అతను ఫిట్‌గా ఉన్నాడు.
ఆసియా కప్‌లో బుమ్రాపై పెద్దగా వర్క్‌లోడ్‌పడలేదు. కాబట్టి రెండు టెస్ట్‌లకు అతను అందుబాటులో ఉంటాడు. కరుణ్‌కు చాలా అవకాశాలు ఇచ్చాం. వాటిని వినియోగించుకోలేకపోయాడు. ఇంగ్లండ్టూర్లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్‌సెంచరీ మాత్రమే చేశాడు. నాయర్‌తో పోలిస్తే పడిక్కల్ బెటర్‌గా కనిపిస్తున్నాడు. మరో ఏడాది వరకు విదేశీ టూర్లు లేవు.
కాబట్టి ఈశ్వరన్‌ను కొనసాగించడం కష్టం. ఇప్పటికే రాహుల్, యశస్వి ఓపెనర్లుగా ఉన్నారు. వాళ్లిద్దరూ బాగానే ఆడుతున్నారు’ అని అగార్కర్‌వివరించాడు. గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్‌స్థానంలో రవీంద్ర జడేజాకు వైస్‌కెప్టెన్సీ అప్పగించారు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు పంత్ అందుబాటులో ఉండే చాన్స్ ఉందని చెప్పాడు. పేసర్ మహ్మద్‌షమీపై ఎలాంటి అప్‌డేట్‌లేదని అగార్కర్‌చెప్పాడు.
జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.