ఖాకీ డ్రెస్​లో కాశీ కాల భైరవుడు

ఖాకీ డ్రెస్​లో కాశీ కాల భైరవుడు

వారణాసి: ఉత్తరప్రదేశ్‌‌లోని వారణాసిలో బాబా కాల భైరవుడు పోలీసు యూనిఫారంలో దర్శనమిచ్చాడు. కాల భైరవుడిని ‘‘కాశీ కా కొత్వాల్‌‌’’గా స్థానికులు పిలుచుకుంటారు. దానికి తగ్గట్లే ఇప్పుడు యూనిఫారం కూడా తోడైంది. తలపై టోపీ, చెస్ట్‌‌పై బ్యాడ్జ్‌‌, ఎడమ చేతిలో సిల్వర్‌‌‌‌ లాఠీ, కుడి చేతితో రిజిస్టర్‌‌‌‌లో పెన్నుతో రాస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ఈ న్యూస్‌‌ ఆ నోటా ఈ నోటా పడి కాశీ మొత్తం తెలియడంతో భైరవుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

బాబా కాల భైరవుడు ఫస్ట్‌‌ టైమ్‌‌ పోలీసు వేషంలో దర్శనమిచ్చినట్లు ఆలయంలో పనిచేసే మహంత్‌‌ అనిల్‌‌ దుబే చెప్పారు. రిజిస్టర్‌‌‌‌, పెన్నుతో ఆయనే స్వయంగా కూర్చోవడంతో అందరి సమస్యలూ పరిష్కరిస్తాడని భక్తులు అంటున్నారు. అలాగే కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుతాడని చెప్తున్నారు. కాల భైరవుడికి ఉన్న చాలా రూపాల్లో ఈ పోలీసు రూపం కూడా ఒకటని భక్తులు నమ్ముతున్నారు. తప్పు చేసిన వారిని బాబా శిక్షిస్తాడని అంటున్నారు.