అగ్నిప్రమాదంలో యువకుడు సజీవ దహనం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో ఘటన

అగ్నిప్రమాదంలో యువకుడు సజీవ దహనం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో ఘటన

గండిపేట, వెలుగు: అగ్నిప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన వికాస్‌(21) కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ లక్ష్మీగూడ బృందావన్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి.

బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న వికాస్‌ మంటలను గమనించి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. హాలులో మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.