‘ఫోన్ భూత్’ మూవీలో దెయ్యం పాత్రలో కత్రినా కైఫ్

‘ఫోన్ భూత్’ మూవీలో దెయ్యం పాత్రలో కత్రినా కైఫ్

గాళ్‌‌ఫ్రెండ్‌‌గా నటించింది. ఇల్లాలిగా మెప్పించింది. రాజకీయ నాయకురాలిగా కనిపించింది. యాక్షన్ క్వీన్‌‌గానూ ఇంప్రెస్‌‌ చేసింది. ఇప్పుడు భూతంగా వచ్చి ఆకట్టుకుంటానంటోంది కత్రినా కైఫ్. గుర్మీత్ సింగ్ డైరెక్షన్‌‌లో ‘ఫోన్ భూత్’ అనే సినిమా చేస్తోంది కత్రినా. నవంబర్ 4న రిలీజ్. నిన్న ట్రైలర్‌‌‌‌ను వదిలారు. ఇందులో అందమైన దెయ్యం పాత్రలో కనిపించింది కత్రినా. ఇద్దరు కుర్రాళ్లు (ఇషాన్ ఖత్తర్, సిద్ధాంత్ చతుర్వేది). బతకడానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటి వాళ్లకి సడెన్‌‌గా దెయ్యాలు కనిపిస్తుంటాయి. ఆ పవర్‌‌‌‌ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఘోస్ట్ బస్టర్స్‌‌గా మారతారు. అంతలో ఒకరోజు కత్రినా వాళ్లని వెతుక్కుంటూ వస్తుంది. తానొక భూతాన్ని అని, ఓ బిజినెస్ ఐడియాతో వచ్చానని చెబుతుంది.

ఆమె సాయంతో ‘ఫోన్ భూత్’ తెరుస్తారు. దెయ్యాల్ని వదిలించి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. అయితే కత్రినా వాళ్ల దగ్గరకు రావడం వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. అదేంటి, వాళ్ల సాయంతో ఆమె దాన్నెలా సాధించింది అనేది మిగతా కథ. ఫన్నీ డైలాగ్స్, కామెడీ సీన్స్‌‌తో ట్రైలర్ కడుపుబ్బ నవ్వించింది. ఇదో మంచి ఫన్ ఎంటర్‌‌‌‌టైనర్ అనే హింట్ ఇచ్చింది. ‘సూర్యవంశీ’ చిత్రంతో హిట్ కొట్టాక కత్రినా చేస్తున్న సినిమా ఇది. చూస్తుంటే ఆమె ఖాతాలో మరో హిట్టు పడేలానే ఉంది.