ఏపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు: టీఆర్ఎస్ చీఫ్ కవిత

ఏపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు: టీఆర్ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, వెలుగు: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి తెరచాటుగా ఏపీకి సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో లోపాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులివ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోమవారం కవిత ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో ఏపీకి ఎంతగా సహకరిస్తున్నారో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.