పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి మాట్లాడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నా రు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం.
తెలంగాణ ఎంత బాగుందో.... ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్ లో మాట్లాడాను. పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలనే కోరుకుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం. ఆనాడు మీరు సినిమానటుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏపీ డిప్యూటీ సీఎం. మీ మాటలను ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ' అని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే ప్రభుత్వ భూములను కైవసం చేసుకుని జాగృతి జెండాలు పాతుతామని హెచ్చరించారు.
