కొత్తగూడెం రైల్వేస్టేషన్లో పేలిన నాటుబాంబు

కొత్తగూడెం రైల్వేస్టేషన్లో పేలిన నాటుబాంబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో నాటు  బాంబు కలకలం రేపింది.  రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల చేతి సంచిలో  బాంబులను వదిలి వెళ్లారు.  దీంతో తినే ఆహారపధార్థం అనుకుని కుక్క  రైల్వే ట్రాక్ పై  ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబుని కుక్క కొరికింది.  భారీ శబ్దంతో పేలుడు జరిగడంతో  కుక్క  అక్కడికక్కడే మృతి చెందింది. 

భారీ శబ్దం రావడంతో  రైల్వేస్టేషన్ లో  ఉన్న  ప్రయాణికులు  పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారంతో 3వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ జాగిలాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని  క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా ఆరు ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న నాటు బాంబులను గుర్తించారు పోలీసులు.

ALSO READ : మన్నెగూడ–హైదరాబాద్ నేషనల్ హైవేపై..