గతేడాది పట్నంలో లేడు..ఈ సారి లండన్ పోయిండు.. రాఖీ కట్టలేను.. మాకు కూడా రేషం ఉంటది : కవిత

గతేడాది పట్నంలో లేడు..ఈ సారి లండన్ పోయిండు.. రాఖీ కట్టలేను.. మాకు కూడా రేషం ఉంటది : కవిత

రాఖీ పండుగ వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి, తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టిన కవిత... తన అన్న కేటీఆర్ కు రాఖీ కట్టే అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ కు రాఖీ కడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ... గతేడాది రాఖీ కడదామంటే ఆయన పట్నంలో లేరని, ఈసారి కనీసం అడగకుండానే లండన్ కు వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు.మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా? నా ఆత్మగౌరవం బాగా దెబ్బతింది. ఒక ఆడబిడ్డగా నాకు రోషం ఉంటుంది కదా? అంటూ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

అన్న కేటీఆర్ తోనే కాదు, తండ్రి కేసీఆర్ తోనూ ఆమె ప్రస్తుతం దూరంగానే ఉంటున్నారు. ఇటీవల కేసీఆర్ బావమరిది మృతి చెందిన సమయంలోనూ... కవిత  కేసీఆర్ కు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. 
.