కలియుగం అంతానికి వచ్చేసింది : ఈ ఘోరం చూశాక ఇంకా నిదర్శనం కావాలా..!

కలియుగం అంతానికి వచ్చేసింది : ఈ ఘోరం చూశాక ఇంకా నిదర్శనం కావాలా..!

కలియుగం వచ్చేసింది.. కలియుగం అంతం అవుతుంది అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కలియుగం అంతం ఎప్పుడో ఏమో కానీ.. కలియుగంలో జరగాల్సినవి అన్నీ జరుగుతున్నాయి.. చూడాల్సిన ఘోరాలు అన్నీ జనం చూడటం అయితే జరుగుతుంది. మనుషులు ఇలా ఉన్నారేంటీ.. ఇంతలా మారారా అనే ఘటనలు కలియుగం అంతానికి వచ్చేసిందనే మాటలకు నిదర్శనంగా ఉన్నాయి. నేపాల్ దేశం వరదలు వచ్చి వందల మంది చనిపోయారు కదా.. ఆ వరదల్లో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం రాళ్లు, చెట్ల మధ్య ఇరుక్కుపోయింది.. ఆ మృతదేహాన్ని బయటకు తీయటం అటుంచి.. ఆమె శరీరంపై ఉన్న బంగారాన్ని తీసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేపాల్‌ని భయంకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల మంది గల్లంతై ఆచూకీ తెలియక ఫ్యామిలీస్ ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు గల్లైయ్యారు. ఈ కష్టకాలంలోనూ మానవత్వం సిగ్గుపడేలా కొన్ని అమానుష ఘటనలు వెలుగులోకి రావడం అందరినీ కలచివేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక దారుణమైన వీడియోలో వరద నీటిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం చెత్తాచెదారం మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ శవం వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి.. ఒక వ్యక్తి కర్రతో శవాన్ని దగ్గరకు లాగగా, మరొక వ్యక్తి ఆ మహిళ జుట్టు పట్టుకుని చెవికి ఉన్న బంగారు కమ్మలను తీసుకున్న వీడియో నెట్టింట అందరినీ కలచివేస్తోంది. 

ఈ నీచమైన చర్య అక్కడ ఉన్నవారందరూ చూస్తున్నప్పటికీ.. ఎవరూ వారిని వారించకపోవడం మరింత గమనించదగ్గ విషయం. ఈ దారుణ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు కలియుగం తారాస్థాయికి చేరింది, మనుషుల కంటే జంతువులే నయం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విపత్తులో వందలాది మంది పర్యాచకులు గల్లైయ్యారు. ఇందులో అత్యధికంగా భారతీయులు 178 మంది ఉండగా.. అమెరికా, ఉక్రెయిన్ తదితర దేశాల వారు కూడా ఉన్నారు. ఒకవైపు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పోరాడుతుంటే.. ఇలా శవాలపై కూడా దయలేకుండా దోపిడీకి పాల్పడటంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.