ఆపిల్ తన ఏడాదిలో అత్యంత ముఖ్యమైన ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించనుంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ఆపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వేడుక జరగనుండగా.. కంపెనీ వెబ్‌సైట్‌లో దీనిని లైవ్‌స్ట్రీమ్ చేయనున్నారు. సర్ప్రైజ్ అండ్ షైన్ అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో మీడియాకు ఆహ్వానాలు పంపారు.
ఈ ఈవెంట్ ద్వారా ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇప్పటివరకు శాంసంగ్ ఆధిపత్యంలో ఉన్న ఫోల్డబుల్ మార్కెట్లోకి ఆపిల్ అడుగుపెడుతుండటం ఫ్యాన్స్ లో ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. ఐఫోన్ రాకకు దాదాపు 20 ఏళ్లు నిండుతున్న తరుణంలో వస్తున్న ఈ ఫోల్డబుల్ డిజైన్, ఐఫోన్ చరిత్రలోనే అత్యంత పెద్ద మార్పుగా నిలవనుంది. ఇది పాస్‌పోర్ట్ సైజులో ఉండి.. తెరిస్తే చిన్న ఐప్యాడ్ స్క్రీన్ అంత పెద్దదిగా మారుతుంది.
ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను కూడా ఆపిల్ తీసుకురానుంది. వీటిలో మరింత వేగవంతమైన చిప్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్, అత్యాధునిక కెమెరా ఫీచర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా పెద్ద మోడల్‌లో మెకానికల్ అపర్చర్ వంటి పెద్ద మార్పులు చేశారు. అయితే 2వ తరం ఐఫోన్ ఎయిర్ లేదా సాధారణ ఐఫోన్ 18 మోడళ్లను మాత్రం ఈ సెప్టెంబర్ ఈవెంట్‌లో విడుదల చేయడం లేదు. అమ్మకాలను ఏడాది పొడవునా స్థిరంగా ఉంచేందుకు వీటి విడుదల తేదీలను వచ్చే వసంత కాలానికి మార్చారు.
ఈ ఈవెంట్ ద్వారా జాన్ టెర్నస్ ఆపిల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. గత 15 ఏళ్లుగా కంపెనీని నడిపించిన టిమ్ కుక్ స్థానంలో టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. టిమ్ కుక్ సప్లై చైన్ అండ్ సేల్స్ నిపుణుడిగా పేరు తెచ్చుకోగా.. హార్డ్‌వేర్ ఇంజనీరైన టెర్నస్ కొత్త ప్రొడక్ట్ కేటగిరీలు, ఏఐ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించారు.
ALSO READ : హోటల్ లేదా ఓయోలో రూమ్ తీసుకుంటున్నారా
సెప్టెంబర్ 9న జరిగే ఈ వేడుకలో కొత్త ఐఫోన్‌లతో పాటు ఆపిల్ వాచ్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మార్ట్ హోమ్ హబ్, హోమ్‌పాడ్ మినీ, ఆపిల్ టీవీ, అప్‌గ్రేడ్ చేసిన ఐప్యాడ్ మినీ వంటి గృహోపకరణాలను కూడా ఆపిల్ రాబోయే రోజుల్లో మార్కెట్లోకి తీసుకురానుంది. కొత్త సీఈఓ నాయకత్వంలో ఆపిల్ చేస్తున్న ఈ భారీ ప్రయోగాలు ఎలా విజయవంతం అవుతాయో వేచి చూడాల్సిందే.
