మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్..బీఆర్ఎస్ ను చీల్చేందుకు హరీశ్ కుట్ర: కవిత

మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్..బీఆర్ఎస్ ను చీల్చేందుకు హరీశ్ కుట్ర: కవిత

మాజీ మంత్రి హరీశ్ రావుపై టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని  వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో  హరీశ్ రావు  సీక్రెట్ మీటింగ్ పెట్టారని చెప్పారు.  ఈ సమావేశంలో  ఎన్టీఆర్ పేరు ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకుని ఆ తర్వాత బీజేపీ సపోర్టు తీసుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు.  దీనికోసం ఆర్ఎస్ఎస్  నేతలతో హరీశ్ రావు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని అన్నారు కవిత.  హరీశ్ కు బీజేపీతో మిలాఖత్ ఉందనడానికి  తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు కవిత.

సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ ల లండన్ లాలూచీ ఏంటో బయటపెట్టాలన్నారు కవిత.  నారాయణ, చైతన్య కాలేజీలపై హరీశ్ రావు ఎందుకు మాట్లాడని ప్రశ్నించారు.  హరీశ్ రావు,నారాయణ చైతన్య కాలేజీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. నారాయణ,చైతన్య సంస్థలకు రూ. 960 కోట్ల పాల సరఫరా జరిగిందని ఆరోపించారు.  చాలా డెయిరీలున్నా..హరీశ్ డెయిరీ నుంచే ఎందుకు పాల సరఫరా? చేస్తున్నారని ప్రశ్నించారు.  యశోద ఆస్పత్రికి భూమి కేటాయింపు,పాల సరఫరా చేశారని అన్నారు.  బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి మయం అవుతుందన్నారు కవిత.