నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలి: కవిత

నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలి: కవిత

నిజామాబాద్ లోక్ సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలుచేశారు. తాజా, మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. కార్యకర్తలను అధిష్టానం నేతలను కలవకుండా కొంత మంది నేతలు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. తానుస్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే..రకరకాల అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

జిల్లాలో పార్టీతీరుపై నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయామంటే ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారుకవిత. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ఇవ్వాలని సూచించారు.