కాజీపేట - బల్లార్షా మార్గంలో పలు రైళ్లు రద్దు.. ఎందుకంటే..

కాజీపేట - బల్లార్షా మార్గంలో  పలు రైళ్లు రద్దు.. ఎందుకంటే..

కాజీపేట.వెలుగు : కాజీపేట -– బల్లార్షా మార్గంలో పెద్దపల్లి దగ్గర ఇంటర్‌‌ లాకింగ్‌‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే ఛీఫ్‌‌ పబ్లిక్‌‌ రిలేషన్‌‌ ఆఫీసర్‌‌ శ్రీధర్‌‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిర్పూర్‌‌ టౌన్‌‌ – కరీంనగర్, కరీంనగర్‌‌ – సిర్పూర్‌‌ టౌన్, కాజీపేట – సిర్పూర్‌‌టౌన్‌‌, బల్లార్షా – కాజీపేట, కాజీపేట – బల్లార్షా, సికింద్రాబాద్‌‌ – సిర్పూర్‌‌ కాగజ్‌‌నగర్‌‌, సిర్పూర్‌‌ కాగజ్‌‌నగర్‌‌ – సికింద్రాబాద్‌‌ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రైళ్లు నడవవని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.