హైదరాబాద్:కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా జర్నలిస్టు కాలనీ, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.మాదాపూర్, కేబుల్ బ్రిడ్జ్, హైటెక్ సిటీ వెళ్లే వాహనదారులతో జర్నలిస్టు కాలనీ, రోడ్ నెంబర్ 45 వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది దీంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు.
ఛేంజింగ్ లైన్ల విషయంతో వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఛేంజింగ్ లైన్ దాటి వెళితే తిరిగి గమ్యస్థానానికి చేరుకునేందుకు వాహనదారులు అవస్తలు పడుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. వాహనదారుల ఇబ్బంది లేకుండా పెద్ద సైనేజ్ బోర్డులకు ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఆగస్టు 18 నుంచి KBR పార్కు చుట్టూ వన్ వే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్కు చుట్టు అండర్ పాస్ నిర్మాణం పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్ల పాటు ఈ వన్ వే ట్రాఫిక్ అమలు లో ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు సూచనలు, ట్రాఫిక్ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు, ఛేంజింగ్ లైన్ సైన్ బోర్డులను ఫాలో అవుతూ ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ లేనికారిడార్ నిర్మాణంకోసం వెయ్యి కోట్ల90 వ్యయంతో 7 మల్టీ లెవ్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులకోసం ఆగస్టు 18న నుంచి రెండేళ్లపాటు కేబీఆర్ పార్కు చుట్టూ వన్ ట్రాఫిక్ విధానాన్ని పోలీసులు అమల్లోకి తెచ్చారు.
