రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారు: కేసీ వేణుగోపాల్

రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారు: కేసీ వేణుగోపాల్

రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.. ఇవాళ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ పార్టీకి ఆస్తులన్నారు. రాష్ట్రంలో రాహుల్ యాత్రను విజయవంతం చేస్తామని సచిన్ పైలెట్ అన్నారు.

రాహుల్ కి స్వాగతం చెప్పేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నారు. 12 రోజులు రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని సచిన్ చెప్పారు. పార్టీ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లో ధిక్కరించబోమని సీఎం గెహ్లాట్ తెలిపారు.