రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా.. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు

రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా.. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు.  గెలిచిన తర్వాత రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో కోటీ 10 లక్షల కుటుంబాలు ఉన్నాయని..ఈ కుటుంబాల్లో 93 లక్షలకు పైగా బీపీఎల్ కార్డు దారులు ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డులు ఉన్న పేదలకు గెలిచిన తెల్లారి నుంచే వందకు వంద శాతం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కేసీఆర్ బీమాను అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ లెక్కలు తీయించామని చెప్పారు. బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ ఎల్ఐసీ ద్వారానే బీమా చేయించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. 

కేసీఆర్ బీమా పథకంలో భాగంగా ప్రతీ కుటుంబానికి రూ. 3600 నుంచి రూ. 4 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు సీఎం కేసీఆర్. ఈ ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రూ. 5 లక్షలు వచ్చే విధంగా రైతు బీమా తరహాలో అమలు చేస్తామన్నారు. నాలుగైదు నెలల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసి..వచ్చే ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది పాపులర్ స్కీం అని..ప్రతీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 

ALSO READ : ENG vs AFG: అంతా బజ్‌బాల్ మహిమ: ఇంగ్లాండ్ బౌలర్ల తాటతీస్తున్న ఆఫ్ఘన్లు