కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాల పేరు మార్చిన కేసీఆర్

కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాల పేరు మార్చిన కేసీఆర్

రామగుండం బి థర్మల్ ప్రాజెక్ట్ ను సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ గా రూపొందించి  కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపుతున్నారని ఆరోపించారు. రైతు ముఖాముఖీ లో మాట్లాడిన జీవన్ రెడ్డి.. రామగుండం ప్రాంతానికి సాగునీటిని అందించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటిని తరలించుకు పోతున్నారు. నాగార్జునసాగర్ లో ఉపఎన్నికలు వస్తున్నాయని అక్కడ ఏడాదిన్నరలో ఎత్తిపోతల పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ రామగుండం లో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్టీలకు ఆతీతంగా రామగుండం ప్రజలు చందర్ ను గెలిపిస్తే… గెలిచిన  తర్వాత మళ్ళీ కేసీఆర్ పక్కలో చేరాడన్నారు. ఒకే రెండు ఫించన్లు వుండవద్దు…కానీ కేసీఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఉండవచ్చా అని అన్నారు. అడబిడ్డకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాల పేరు మార్చి కొత్త పథకాలు పెట్టినట్టు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు బంధు తేన పూసిన కత్తిలాంటిదన్న జీవన్ రెడ్డి… దుర్మార్గపు సీఎం కేసీఆర్ కు గద్దెదిగే వరకు పోరాడుతామన్నారు.