సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన  వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్​ ప్రకారం మే2 మంగళవారం రోజున కేసీఆర్  ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనివార్య కారణల వలన ఆయన టూర్ వాయిదా పడింది.   అయితే  ఎందుకు వాయిదా పడిందో స్పష్టంగా తెలియరాలేదు. రేపు అంటే మే 03 బుధవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

వాస్తవానికి ఇవాళ ఢిల్లీకి వెళ్లి..  అక్కడ  వసంత్  విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.   మే 4న   పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నట్లుగా కేసీఆర్  ఇప్పటికే ప్రకటించారు.  జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్  ఢిల్లీలోనే ఉండనున్నారు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  ఢిల్లీలోని వసంత్ విహార్ లో  2021 సెప్టెంబర్ లో  భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు.