సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి

సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి  కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి

బాల్క సుమన్ మాట్లాడిన మాటలకు ప్రజల్లో అసహనం కలుగుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి  కేసీఆరేనని ఆరోపించారు. ఇలాంటి భాషను కేసీఆరే రాజకీయాల్లో మొదలు పెట్టారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమందిని బూతులు తిట్టారని చెప్పారు. సుమన్ చెప్పును కేసీఆర్ కి చూపించాలి కానీ రేవంత్ రెడ్డికి కాదని అన్నారు. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్ లను కేసీఆర్  అవమాన పరిచారని చెప్పారు.  

కేసీఆర్ బానిసత్వంలో బాల్క సుమన్ చిన్న వ్యక్తి అని వివేక్ వెంకటస్వామి అన్నారు. అధికారం పోయిందనే ప్రస్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చెప్పుతున్న నిజాలను తట్టుకోలేక పోతున్నారని తెలిపారు. చేసిన తప్పులను సరిదిద్దు  కాకుండా మళ్లీ తప్పులు చేస్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు.  బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చాలా మంది కాంగ్రెస్ లో చేరబోతున్నారని అన్నారు.