
అవినీతి చేసి సంపాదించిన డబ్బును సీఎం కేసీఆర్ ఎన్నికలు కోసం ఖర్చు చేస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీచర్లను కూడా డబ్బులతో కొనాలని కేసీఆర్ చూస్తున్నాడని చెప్పారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమన్న వివేక్.. అందరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే AVN రెడ్డిని ఇప్పుడు గెలిపించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులకు టైమ్ కు జీతాలు, పీఆర్సీ రావాలని వివేక్ చెప్పారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పొందుపరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని, బడ్జెట్లో నిధులను కూడా కేటాయించలేదన్నారు. అనేక స్కూల్స్ రెంట్ బిల్డింగ్ లో నడుస్తున్నాయని విమర్శించారు. ప్రదాని మోడీ ప్రపంచంలో మంచి పేరును సంపాదించుకున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోడీ పని చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తాజా బడ్జెట్లో విద్యకు బాగా నిధులు కేటాయించిందని వెల్లడించారు.