
హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందుకు గవర్నర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
నిన్న రాజ్ భవన్ లో జరిగిన గవర్నర్ ఇఫ్తార్ విందులోనూ కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో.. గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సీఎంల సమావేశం ముగిసిన మర్నాడే.. సీఎం కేసీఆర్ మరోసారి గవర్నర్ ను కలిసి రాష్ట్ర విభజన అంశాలపై చర్చించడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
రాజధాని హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కేటాయించిన భవాలను తెలంగాణకు అప్పగించే అంశంపై గవర్నర్ తో సీఎం మట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటై ఐదేళ్లు పూర్తికావడంతో… విభజన నాటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న అంశాలు, పలు సమస్యల పరిష్కారంపై గవర్నర్ తో సీఎం డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.