పోడు భూముల పట్టాలిచ్చేందుకు నేనే బయల్దేరుతా

పోడు భూముల పట్టాలిచ్చేందుకు నేనే బయల్దేరుతా

పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో జరుగుతున్న వివాదాలను పరిష్కరిస్తామన్నారు. త్వరలో పోడుభూముల పట్టాలు ఇచ్చేందుకు స్వయంగా తానే బయల్దేరతా అని సీఎం కేసీఆర్ చెప్పారు.

“మంత్రులు అధికారులు, అందరూ నాతోపాటు పోడుభూముల పట్టాల పంపిణీకి వస్తారు. ఒక్కసారి పోడు భూముల పట్టాల పంపిణీ తర్వాత వివాదాలు జరగవు.  ఆ తర్వాత ఒక్క సెంట్ పోడు భూమి కూడా కొట్టనివ్వం” అని కేసీఆర్ అన్నారు.