భూ దందాలు చేయలే.. ఎవరిని బెదిరించలే : కాలె యాదయ్య 

భూ దందాలు చేయలే.. ఎవరిని బెదిరించలే : కాలె యాదయ్య 
  • అలా చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్త
  • కాంగ్రెస్, బీజేపీ నుంచి గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు

చేవెళ్ల, వెలుగు : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కొండన్నగారి రామ్ రెడ్డి 100 మంది కార్యకర్తలతో కార్తీక్ రెడ్డి, కాలె యాదయ్య సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా చేసి చూపించారన్నారు.  చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థికి బీఫామ్ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికలకే ఆలోచించి ఓటు వేస్తామని అలాంటిది ఎమ్మెల్యేను ఎన్నుకునే ముందు మరింతగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇంద్రారెడ్డి వారసుడు కార్తీక్ రెడ్డి తనను ముందుండి నడిపిస్తున్నాడని యాదయ్య తెలిపారు.

తాను భూ దందాలు చేయలేదని.. ఎవరిని బెదిరించలేదన్నారు. అలాంటివి ఉన్నట్లు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం చేవెళ్ల మండల పరిధిలోని గుండాల ఎంపీటీసీ తిపని సుజాత శివారెడ్డి, కాంతారెడ్డితో పాటు 300 మంది ఇతర పార్టీల నేతలు కార్తీక్ రెడ్డి, కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మెంబర్ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్య శంకర్, మోహన్ రెడ్డి, వెంకటేశం గుప్తా, మాజీ ఎంపీపీ బాల్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్ గౌడ్, మైనార్టీ జిల్లా నాయకులు అలీ, కౌకుంట్ల గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగార్జున రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ గణేశ్, నాయకులు పాల్గొన్నారు.