
కాళేశ్వరంను రాష్ట్రంలోనే అధ్బుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతానని అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం కేసీఆర్ దంపతులు కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాళేశ్వరంను మరో యాదాద్రిలా చేద్దాం అని అధికారులతో అన్నారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సీఎస్, పలువురు అధికారులు ఉన్నారు.