కేసీఆర్ భయపడే వరంగల్ ఎన్నికలను పోస్టు పోన్ చేశారు

కేసీఆర్ భయపడే  వరంగల్ ఎన్నికలను పోస్టు పోన్ చేశారు

గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఇంతకాలం  TRS  పార్టీ ప్రజలను తప్పుదోవపట్టించి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాష్ట్ర పథకాలుగా చిత్రీకరించిన విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారులు కూడా TRS ప్రభుత్వానికి వంతపాడుతున్నారని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయాన్ని గుర్తించారు కాబట్టి బీజేపీని గెలిపించారన్నారు.

రాష్ట్రంలో బీజెపి అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజల కోసం బీజేపీ ప్రజల్లో ఉంటుందన్నారు.TRS పార్టీ మునిగిపోయె నావా అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారన్న బండి సంజయ్..కేటీఆర్ ను సీఎంగా చేయడంపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 2023 లో తెలంగాణ లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. వరంగల్ ఎన్నికలు పెడుతామన్న కేసీఆర్… బయపడి మళ్లీ పోస్టుపోన్ చేశారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం ఒక్క పైసా ఇవ్వలేదు కాబట్టే GHMC ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇచ్చిన హామీలు కేసీఆర్ నెరవేర్చకపోగా, కనీసం సమస్యలు కూడా గుర్తించడం లేదన్నారు. కేంద్రం నిధులను దొంగల్లాగా ఓ వైపు దోచుకుంటూనే… మరోవైపు మాతో కలిసి పని చేస్తామని కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు బండిసంజయ్ .