
సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి … తన తండ్రి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార సభలో తెలుగు రాష్ట్రాల మధ్య నదుల సమస్యను కేసీఆర్ ప్రస్తావించారు.
కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయన్న కేసీఆర్.. అక్కడ లభించే ఒక్కో నీటిబొట్టును ఒడుపుగా, ఒద్దికగా.. కలిసి వినియోగించుకోవాలని.. సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో.. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అంగుళం సస్యశ్యామలం చేసుకోవాలని ఆకాంక్షించారు. కర్తవ్య నిర్వహణలో అవసరమైన అండదండలు సహాయక సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని తెలియజేస్తుందన్నారు. జగన్ కు జనం అద్భుతమైన అవకాశం ఇచ్చారనీ.. సద్వినియోగం చేసుకుని నాన్న పేరు నిలబెట్టి… చరిత్రలో నిలిచిపోయేలా కీర్తిప్రతిష్టలు సంపాదించాలని అన్నారు.