కేదార్‌నాథ్ భక్తులకు అలెర్ట్.. రిజిస్ట్రేష‌న్లు బంద్‌

కేదార్‌నాథ్ భక్తులకు అలెర్ట్..  రిజిస్ట్రేష‌న్లు బంద్‌

కేదార్‌నాథ్   వెళ్లే భక్తులకు అధికారులు  కీలక ప్రకటన చేశారు. మే 08 వరకు రిజిస్ట్రేషన్ల  ప్రక్రియ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.  రాబోయే మూడు, నాలుగు రోజులు వాతవరణ  పరిస్థితులు మారే అవకాశం ఉందని తెలిపారు. అందుకోసం తాత్కలికంగా రిజిస్ట్రేషన్ల  ప్రక్రియ నిలిపివేస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం  తెలిపారు.  మే 4 వరకు 1.23 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్ ను సందర్శించారు.

గురువారం కేదార్‌నాథ్ రూట్లో ఉన్న బైరాన్ గ్లేసియ‌ర్ కూల‌డంతో.. ఆ రూటును క్లోజ్ చేశారు. డీడీఎం, ఎడీఆర్ఎఫ్‌, డీడీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్‌, వైఎంఎఫ్ ద‌ళాలు మంచు ముక్క‌ల్ని తొల‌గించారు. గుర్రాలు, గాడిద‌లు వెళ్లే రూటును కూడా ఇంకా తెరువ‌లేదు. చాలా వేగ‌వంతంగా న‌డ‌క రూట్లో స్నోను తొల‌గిస్తున్నారు. భైర‌వ్‌, కుబేర్ ఘాట్ రూట్లో గ్లేసియ‌ర్ కూల‌డంతో ఆ రూట్‌ను మూసివేశారు.