మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తలుపులు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలను జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.
ఈ మధ్య కాలంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంటి తలుపులు పగుల గొట్టి ఇంట్లో ఉన్న సొమ్ము ఎత్తుకెళుతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
వీరంతా గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. అంతేకాదు.. నిందితులంతా చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు.. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. దోచుకున్న సొమ్ముతో గోవా వెళ్లి జల్సా చేసి వస్తున్న వీరిని మల్కాజిగిరి సిసిఎస్ టీమ్ సహకారంతో కీసర ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేశారు.
