ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్లను కరిచేలా.. కుక్కలకు ట్రైనింగ్

ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్లను కరిచేలా.. కుక్కలకు ట్రైనింగ్
  • డ్రగ్స్ డీలర్‌‌ ఇంట్లో  రైడ్‌‌కు వెళ్లి కంగుతిన్న పోలీసులు
  • కేరళలోని కొట్టాయంలో17 కిలోల గంజాయి సీజ్

తిరువనంతపురం: డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నదని అందిన సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయంకరమైన పరిస్థితి ఎదురైంది. నిందితుడి ఇంట్లో  సోదాలకు వెళ్లినవాళ్లల్లో ఖాకీ డ్రెస్ వేసుకున్న ఆఫీసర్లపై కుక్కలు ఒక్కసారిగా  ఎటాక్ చేశాయి. ఈ గ్యాప్ లో స్మగ్లర్ అక్కడి నుంచి  ఎస్కేప్ అయిపోయాడు. కుక్కల  దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న పోలీసులు.. చేసేది లేక ఘటనాస్థలంలో దొరికిన 17కిలోల గంజాయిని సీజ్ చేసి వెనుదిరిగారు.

అసలు ఏం జరిగిందంటే..

డ్రగ్స్ అమ్ముతున్నాడనే ఆరోపణలతో  కేరళలోని కొట్టాయం గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. టీములోని  కొందరు పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకుని ఉన్నారు. సోదాలు చేసేందుకు నిందితుడి ఇంట్లోకి వెళ్లిన ఖాకీ డ్రెస్ ఉన్న  పోలీసులపైకి 13 కుక్కలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దాంతో భయపడిన అధికారులు..అతికష్టం మీద తప్పించుకుని వాటిని తెలివిగా లొంగదీసుకున్నారు. ఈ ఘటనపై కొట్టాయం ఎస్పీ మాట్లాడుతూ.." సెర్చ్ ఆపరేషన్ జరిగే డ్రగ్ డీలర్ ఇంట్లో డాగ్స్ ఉంటాయని ఊహించలేదు. ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిని కరిచేలా కుక్కలకు నిందితుడు ట్రైనింగ్ ఇచ్చాడు. అవి అధికారులపై దాడి చేస్తుంటే నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. అదృష్టవశాత్తూ అధికారులెవరూ  గాయపడలేదు. నిందితుడు పారిపోగా.. ఆ స్థలం నుంచి 17 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశాం" అని పేర్కొన్నారు.

డాగ్‌‌ ట్రైనింగ్‌‌ పేరిట స్మగ్లింగ్

నిందితుడు అద్దె ఇంట్లో ఉంటూ  డాగ్‌‌ ట్రైనర్‌‌గా చెప్పుకుంటూ  డ్రగ్స్‌‌ అమ్ముతున్నాడని కొట్టాయం ఎస్పీ  వెల్లడించారు. రిటైర్డ్‌‌ బీఎస్‌‌ఎఫ్‌‌ ఆఫీసర్ దగ్గర డాగ్‌‌ ట్రైనింగ్‌‌లో శిక్షణ తీసుకున్నాడని.. అనంతరం  డాగ్‌‌ ట్రైనర్‌‌గా మారాడని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న పోలీసులు.. డ్రగ్స్‌‌ డీలింగ్‌‌లో  ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా
అన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.