Viral news: వావ్..వీళ్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదుర్స్..హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Viral news: వావ్..వీళ్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదుర్స్..హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

పాపులర్ సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. గుర్తింపుకు నోచుకోని కొందరు టాలెంటెడ్  వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ను చూపిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల కాలంలో పాపులర్ పాటలకు డ్యాన్సులు చేయడం అనేది సోషల్ మీడియాలో మంచి గుర్తింపునిస్తోంది. అదరగొట్టే డ్యాన్సులతో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఎంతలా అంటే వారిని ఆరాధించేంతగా. చాలామంది డ్యాన్స్ టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లతో ట్రెండింగ్ ఉన్న సినిమాలను పాటలకు డ్యాన్సులను చేస్తున్న వీడియోలు నెట్ లో లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి గుర్తింపు పొందిన ఓ డ్యాన్స్ టీం గురించి మనం తెలుసుకుందాం.. 

ఈ టీంకు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. లుంగీలు ధరించి ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన పాటలకు డ్యాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది. 1997లో వచ్చి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సింగల్ ఎవ్రీబడీ పాటకు డ్యాన్స్ ను అదరగొట్టారు. వీరు మలయాళ డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ D4 డ్యాన్స్ లో మంచి గుర్తింపు పొందారు. 

డ్యాన్సర్లు జీవ్, విజీస్ , విచు, రాకేష్  రక్కు, తాజ్జు రాజీల్ లు ఒక బృందంగా ఏర్పడి.. కేరళ సాంస్కృతిక చరిత్రను  పాప్ సంగీతంతో మిళితం చేసి వారు చేసిన డ్యాన్స్ సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఈ బృందం వైలెట్ కలర్ లుంగి, తెల్ల చొక్కాలు, స్టిప్పర్లతో 1997లో వచ్చి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సింగల్ ఎవ్రీబడీ పాటకు డ్యాన్స్ ను అదరగొట్టారు. ఈ క్లిప్ తో పాటు సాధారణ ప్రపంచంలో మేం అసాధారణమైన మానవులం అని  ట్యాగ్ చేశారు. 

పోస్ట్ చేసినప్పటినుంచి క్లిప్ 7మిలియన్లకు పైగా నెటిజన్లు చూశారు. కొందరు నెటిజన్లు వీరికి ఇండియన్ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ అని పేరు పెట్టారు. ఇంకొందరు అద్భుతమైన కొరియోగ్రఫి చేశారు. సృజనాత్మకంగా , ఫన్నీగా చేశారు. ముఖ్యంగా వీరు ధరించిన కేరళ సాంప్రదాయ డ్రెస్సు చాలా బాగుందని ప్రశంసలతో ముంచెత్తారు నెటిజన్లు.. టాలెంట్ ఎవరు ప్రదర్శించినా మెచ్చుకోక ఉండలేం కదా..