న్యూఢిల్లీ: వినియోగదారులు, వ్యాపార సంస్థలను ప్రభావితం చేసే పలు ఆర్థిక మార్పులు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. వివరాలు ఇవి..
ఇక నుంచి యూపీఐ ద్వారా కొత్త వ్యక్తికి రూ.10 వేల కంటే ఎక్కువ పంపితే క్రెడిట్ కావడానికి గంట పడుతుంది. రూ. 50 వేల కంటే ఎక్కువ పంపితే బయోమెట్రిక్ అథెంటికేషన్ వంటి అదనపు వెరిఫికేషన్లు అవసరం అవుతాయి.
ఏటీఎంల నుంచి కార్డుతో కాకుండా యూపీఐ పద్ధతిలో డబ్బు తీసుకున్నా, బ్యాంకుల నెలవారీ ఉచిత పరిమితిలో చేర్చారు. గడువు దాటితే అదనపు చార్జీలు ఉంటాయి.
2026-–27 ఆర్థిక సంవత్సర ముందస్తు పన్ను మొదటి విడత చెల్లింపునకు జూన్ 15 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అంచనా వేసిన పన్ను బాధ్యత రూ. 10 వేలు దాటిన వారు 15 శాతం పన్ను చెల్లించాలి.
ఈపీఎఫ్ఓ చందాదారులు తమ డబ్బును యూపీఐ ద్వారా తీసుకునే విధానాన్ని పరీక్షిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
కొన్ని సందర్భాల్లో రూ. 50 వేలు దాటిన నగదు డిపాజిట్లకు ఇక నుంచి పాన్‌కార్డు ఇవ్వడం తప్పనిసరి కాదు.
