పంజాగుట్ట, వెలుగు: 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ మహా గణపతికి సంబంధించిన కర్రపూజ కార్యక్రమం గురువారం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి, శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఏరియా కార్పొరేటర్ విజయారెడ్డి హాజరయ్యారు. అనంతరం గణపతి నమూనా పోస్టర్‌ను శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. వినాయక చవితికి ఇంకా 80 రోజులు సమయం ఉండగా, సాధ్యమైనంత త్వరగా మట్టి గణేశుని సిద్ధం చేసి అందజేస్తామని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
