గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు.  ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగింది. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు అశేష ప్రజానీకం నిమజ్జన స్థలం వద్దకు చేరుకున్నారు. అంతకుముందు అట్టహాసంగా ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర  జరిగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై  ఊరేగించారు.  

 

  • ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది.  గంగమ్మ ఒడిలోకి గణేశుడు చేరాడు.

  • ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతోంది.

  • ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ప్రక్రియ మొదలైంది.ః
  • ఖైరతాబాద్ వినాయకుడు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు.

ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ దగ్గర కు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ దగ్గర కు చేరుకున్నాడు. గణేశ్ నిమజ్జనాన్ని చూసేందుకు ఇసుకేస్తే..రాలనంతా జనం చేరుకున్నారు.. కంట్రోల్ చెయ్యలేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.  

క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

ఎన్టీఆర్ మార్గ్ లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసేందుకు.. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు.  ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పాయింట్ వద్దకు చేరుకోవడానికి మరో గంటసేపు సమయం పట్టే అవకాశం ఉంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగే పాయింట్ వద్దకు ఇతర వినాయకుల విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ లోకి పోలీసులు అనుమతించడం లేదు. 

ఉత్సవ సమితి సభ్యులకు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు వాగ్వాదం

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు- టాస్క్ ఫోర్స్ పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఉత్సవ సమితి సభ్యులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.  పోలీసుల తీరు బాగా లేదని ఉత్సవ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి  శోభాయాత్ర నెమ్మదిగా సాగుతోంది.

ట్యాంక్ బండ్ వైపు మహాగణపతి

ఖైరతాబాద్ బడ గణనాథుడు ట్యాంక్ బండ్ వైపు కదిలాడు. ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. అయితే అనుకున్న టైంకంటే కొంచెం ఆలస్యంగా శోభాయాత్ర మొదలైంది. రాత్రంతా వర్షం పడటంతో వెల్డింగ్ పనులు ఆలస్యమయ్యాయి. ఈసారి మట్టి వినాయకుడు కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేశారు. దీంతో శోభాయాత్ర ప్రారంభం ఆలస్యమైంది. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనాలు కోలహలంగా జరుగుతున్నాయి. ఈ సారి ఉదయం నుంచే నిమజ్జనాలు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీ నుంచి కూడా విగ్రహాలు తొందరగానే మూవ్ అవుతున్నాయి. దీంతో మొహంజాహి మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర భక్తుల సందడి కనబడుతోంది. మరోవైపు చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రశాంతంగా నిమజ్జనం ముగిసేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆట పాటలతో భక్తులు గణనాయకున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు. 

వర్షం వల్ల నిమజ్జనం లేట్ : తలసాని

నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 38 వేల వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరగనున్నాయని తెలిపారు. మండపాల నిర్వాహకులు అధికారులతో సహకరిస్తున్నారని చెప్పారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సహకారంతో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. వర్షం వల్ల నిమజ్జనం లేట్ అవుతోందని మంత్రి తలసాని చెప్పారు. 

నెమ్మదిగా నిమజ్జనం.. భక్తుల ఆగ్రహం

హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనం వేడుక కొనసాగుతోంది. ఎన్టీ ఆర్ మార్గ్ లోకి నెక్ల్స్ రోడ్ మీదుగా నిన్న రాత్రి వచ్చిన వినాయక విగ్రహాలకు ఇప్పుడు నిమజ్జనం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిమజ్జనం ఆలస్యం కావడంతో భక్తులు పలురకాలుగా స్పందిస్తున్నారు . కిలోమీటర్ల మేర విగ్రహాలు బారులు తీరడంతో ఈ సమస్య తలెత్తుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భక్తులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే జంట నగరంలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ల వద్దకు అంతకంతకూ పెరుగుతూ వస్తోన్న గణనాథుల నిమజ్జనం ఈ రోజు మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపించడమేనని భక్తులు ఆరోపిస్తున్నారు.

మా పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది: భగవంతరావు

గణేశ్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హిందూ బంధువులంతా ఏకమై నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నారన్నారు భగవంతరావు. నిమజ్జన ఉత్సవాల్లో అస్సోం సీఎం పాల్గొంటారని తెలిపారు. వర్షం వల్ల నిమజ్జనం ఆలస్యం అయినా.....అన్ని విగ్రహాలు హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలన్నారు.

శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలతో నిఘా

బడా గణేశ్​ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటలోపే పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  టెలిఫోన్‌‌ భవన్‌‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్​ రూట్‌‌లో ఎన్టీఆర్ మార్గ్ కు తరలిస్తారు. క్రేన్‌‌ నంబర్‌‌‌‌ 4 వద్ద బడా గణేశ్​ నిమజ్జనం చేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భాగ్యనగరంలో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే హుసేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్‌లు అధికారులు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి 33 చెరువులు, 74 ప్రత్యేక పాండ్స్‌ రెడీ చేశారు. 106 స్టాటిక్‌ క్రేన్లు, 208 మొబైల్‌ క్రేన్లు అందుబాటులో ఉంచారు. 168జీహెచ్‌ఎంసీ యాక్షన్ టీంలు రెడీ కాగా... విధుల్లో 10 వేల మంది శానిటేషన్ వర్కర్లు కూడా పాల్గొననున్నారు.