ఘనంగా దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన

ఘనంగా దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన

కూసుమంచి, వెలుగు :  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లిలో దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయంలో సీతారాముల విగ్రహాలు, బొడ్రాయి, ధ్వజస్తంభం, ముత్యాలమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మూడు రోజులగా కొనసాగిన ఈ వేడుకలు ప్రధాన పూజారి పరిపూర్ణ చారి ఆధ్వర్యంలో చేపట్టారు.

ఆలయ ప్రారంభోత్సవానికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ రాయాల నాగేశ్వర రావు, ఖమ్మం డీసీసీ ప్రెసిడెంట్ నూతి సత్య నారాయణగౌడ్, సర్పంచ్ రామ కృష్ణ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ మర్రి సాగర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పాపిరెడ్డి, కందాల రవి, నూకల మల్లయ్య, ఎల్లి కృష్ణ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.